'ఇసుక అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి'

ఇసుక అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు.

Update: 2023-02-06 13:21 GMT

దిశ, ఏటూరు నాగారం: ఇసుక అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కలక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ ప్రతిపాదించిన ఇసుక రీచ్‌లను వాజేడు మండలం 3, వెంకటాపురం మండలం 7 ఇసుక రీచులను తెలంగాణ మైనింగ్ రూల్స్ ప్రకారం.. డీఎల్ఐసీ ఆమోదించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి త్వరితగతిన నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ఇసుక రీచ్ పర్మిషన్ వివరాలను అటవీ శాఖ వారికి పంపి.. వారి నుంచి క్లియరెన్స్ సూచనలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో డీఎఫ్ఓ కిష్ట గౌడ్, జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ రామాచారి, టీఎస్‌ఎం డీసీపీఓ ఎల్లయ్య, డీసీఓ సర్దార్ సింగ్, జిల్లా భూగర్భ వనరుల శాఖ అధికారి ఎం శ్రీనివాస రావు, కలెక్టరేట్ సూపర్ ఇండెంట్ విశ్వప్రసాద్, ఇర్రిగేషన్ ఎఈఈ శ్రీనివాస రావు, తహసీల్దార్లు శ్రీనివాస్, సంజీవ, లక్ష్మణ్, వెంకటస్వామి, నాగరాజు, పేస కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Similar News