కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షం

జనగామ లో కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో భాగంగా డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

Update: 2024-04-27 15:26 GMT

దిశ,జనగామ : జనగామ లో కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో భాగంగా డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. సాయంత్రం ఆర్అండ్​బీ గెస్ట్ హౌస్ నుండి జనగామ చౌరస్తా వరకు భారీ ర్యాలీ తో ప్రారంభమై చౌరస్తాలో కార్నర్ మీటింగ్ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి,రాజగోపాల్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం బీఆర్ఎస్ దుర్మార్గమైన పరిపాలనకు ప్రజలు చరమ గీతం పాడారని, తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం ఒక్కటే రాష్ట్ర బడ్జెట్​ మింగేసిందని అన్నారు.

    ఏడు నుండి ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. మా ప్రభుత్వం ఆగస్ట్ 15వ తేదీన రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. కవిత జైల్ గయ బీఆర్ ఎస్ బై బై అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం పాలనలో గ్రామ పంచాయతీకి రావలసిన నిధులను గత పాలకులు రాకుండా ఆలస్యం చేశారని, దాని ఫలితం కొంతమంది సర్పంచులపై పడి వారి ఆస్తులు అమ్ముకోవడం, మహిళా సర్పంచులు అయితే వారి పుస్తెలు కూడా తాకట్టు పెట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు. తాము వచ్చాక అన్ని సర్దుకొనేలా చేస్తున్నాని తెలిపారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో ముందుకు సాగాలని కోరారు. జనగామ నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీ ఇస్తున్నారని, అదే స్ట్రాటజీతో ముందుకు సాగాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 

Similar News