కాంగ్రెస్ అబద్దాలతో అధికారంలోకి వచ్చింది : బూర నర్సయ్య గౌడ్

జనగామ జిల్లాలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ప్రచారంలో

Update: 2024-05-02 14:53 GMT

దిశ,జనగామ:జనగామ జిల్లాలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ప్రచారంలో భాగంగా తరిగొప్పుల, నర్మెట, జనగామ లో పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అన్నారు. గురువారం రోజున ప్రచారంలో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలో హాజరై మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ క్వింటాలకు రూ. 500 బోనస్ సాగునీరు ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ పైన మండిపడ్డారు. దేశంలోనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద పీట వేసిందని 370 ఆర్టికల్ అయోధ్య రామ మందిరం ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కాలనీలకు సీసీ రోడ్డు నిర్మాణం మహిళలకు గ్యాస్ కనెక్షన్ రైతులకు సంవత్సరానికి మూడు దఫాలుగా సంవత్సరానికి రూ.6,000 చొప్పున అందిస్తున్న ఘనత మన దేశ ప్రధానమంత్రి మోడీ అని వారు అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని రాష్ట్రంలో అబద్దాలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. మోడీ అంటే 3డి అని, దేశం ధర్మం వైపు వెళ్తుందని, కేంద్రంలో మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అన్నారు.మీరు వేసే ఓటు వజ్రాయుధం లాంటిదని ప్రజలకు ఉపయోగపడే వారికి ఓటు వేయాలని అది బీజేపీ పార్టీ నే అని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్చే శారు.డిసెంబర్ 9వ తారీఖు అమలు చేస్తామన్న రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. గత పదేళ్లుగా మోడీ అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకుంటూ సొంత లాభం తో మోడీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో 12 సీట్లు బీజేపీ బీజేపీ అభ్యర్థులు గెలుస్తారన్నారు. దేశమంతా మోడీ వైపు చూస్తుందని, ప్రపంచ దేశాలకు భారతదేశం స్ఫూర్తిదాయకమన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రజలకు తెలియని పాలఘాట్ వ్యక్తి అని ఆయనకు ప్రజా సమస్యలపై అవగాహన లేదన్నారు. కొంతమంది నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారికి ఓటే తగిన బుద్ధి చెబుతుందని అన్నారు. భువనగిరి పార్లమెంట్ గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అరుట్ల దశమంత రెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్,తదితరులు పాల్గొన్నారు.

Similar News