వడదెబ్బతో రెండు టన్నుల చేపలు మృత్యువాత!

వడదెబ్బతో రెండు టన్నుల చేపలు మృత్యువాత పడిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

Update: 2024-05-06 07:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వడదెబ్బతో రెండు టన్నుల చేపలు మృత్యువాత పడిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలోని కామచెరువును నమ్ముకొని ఆ గ్రామంలోని కొందరు మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. ఆ చెరువులోని చెపలను పట్టి అమ్ముకొని పూట వెల్లదీస్తున్నారు. ఈ వేసవిలో భానుడు నిప్పులు కురిపిస్తుండగా.. వడదెబ్బ కారణంగా దాదాపు రెండు టన్నుల చేపలు మృత్యువాత చెందాయి. దీంతో చెరువుపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న కొన్ని కుటుంబాలకు ఆధారం లేకుండా పోయినట్లు అయ్యింది. ఈ చెరువుపై ఆధారపడి రెండు వందల కుంటుంబాలు జీవనం సాగిస్తున్నామని, చేపలను బ్రతికించుకోవడం నీటి ఏర్పాటు చేసిన లాభం లేకుండా పోయిందని మత్స్యకారులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి తమను జీవనాధారం కోల్పోయిన తమను ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. 

Similar News