మేడారం మహా జాతరకు ముహూర్తం ఫిక్స్

2024 సంవత్సరంలో జరగబోయే మేడారం మహా జాతరకు సంబంధించి తేదీలను మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయం పూజారులు ప్రకటించారు.

Update: 2023-05-03 12:27 GMT

దిశ, ములుగు ప్రతినిధి: 2024 సంవత్సరంలో జరగబోయే మేడారం మహా జాతరకు సంబంధించి తేదీలను మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయం పూజారులు ప్రకటించారు. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసి జాతరగా పిలువబడే మేడారం మహా జాతర జరిగే తేదీలను బుధవారం ఖరారు చేశారు. బుధవారం సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2024మహా జాతర తేదీలను నిర్ణయించి ప్రకటించారు. ఫిబ్రవరి 14న బుధవారం మండమేలగడం మొదలవుతుందని తెలిపారు. 21న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెకు చేరుకుంటారన్నారు. 22న సమ్మక్క దేవత గద్దెకు చేరుకుంటుందన్నారు. 23న భక్తులు మొక్కులు చెల్లించవచ్చన్నారు. 24న దేవతల వనప్రవేశం ఉంటుందన్నారు. 28న తిరుగువారం జాతర పూజలు ముగింపు ఉంటుందన్నారు.

Tags:    

Similar News