నేటి నుంచి దశాబ్ది ఉత్సవాలు ప్రారంభం.. అక్కడి నుంచి సచివాలయానికి సీఎం!

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 22 వతేదీవరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి.

Update: 2023-06-01 23:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 22 వతేదీవరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రగతిభవన్ నుంచి సీఎం కేసీఆర్ గన్ పార్కుకు వచ్చి అమరవీరులకు నివాళులర్పించనున్నారు. అనంతరం 10.30 గంటలకు సీఎం సెక్రెటరీయేట్‌కు చేరుకుంటారు. సచివాలయం ప్రాంగణంలో సీఎం కేసీఆర్ ఉదయం 10.38 గంటలకు జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు. పోలీసుల గౌరవందనాన్ని స్పీకరించిన అనంతరం దశాబ్ది ఉత్సవ సందేశాన్నిస్తారు. అదే రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో జాతీయ పతాక వందనం, దశాబ్ది ఉత్సవ సందేశం ఇవ్వనున్నారు.

Tags:    

Similar News