TSPSC:గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్ అప్డేట్

తెలంగాణలో గ్రూప్-3 సర్వీసులో 1,388 ఉద్యోగాల భర్తీకి 2022లో TSPSC నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-05-03 15:10 GMT

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో గ్రూప్-3 సర్వీసులో 1,388 ఉద్యోగాల భర్తీకి 2022లో TSPSC నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తుల ప్రక్రియ 2023 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు కొనసాగింది. 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఉద్యోగ రాత పరీక్షలు ఈ ఏడాది నవంబర్ 17,18 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గ్రూప్-3 అభ్యర్థులకు మరో అప్‌డేట్ వచ్చింది. మహిళలకు సమాంతర రిజర్వేషన్‌లను అమలు చేస్తునందున గ్రూప్-3 నోటిఫికేషన్‌లో ఖాళీల వివరాల రివైజ్డ్ ఖాళీల బ్రేకప్‌ను శుక్రవారం ప్రకటించింది. ఈ రివైజ్డ్ ఖాళీల బ్రేకప్‌లో మహిళలకు రోస్టార్ పాయింట్ తొలగించి, అన్ని ఖాళీలను రిజర్వ్ కేటగిరీల వారీగా వెల్లడించింది. ఈ సవరణ వివరాలను అధికారిక https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్ లో ఉంచింది.

Similar News