విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

విద్వేష ప్రసంగాలపై ఏం చర్యలు తీసుకుంటున్నారని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. కేవలం కేసుల నమోదుతో ఈ సమస్య పరిష్కారం కాదని వ్యాఖ్యానించింది.

Update: 2023-03-28 13:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: విద్వేష ప్రసంగాలపై ఏం చర్యలు తీసుకుంటున్నారని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. కేవలం కేసుల నమోదుతో ఈ సమస్య పరిష్కారం కాదని వ్యాఖ్యానించింది. విద్వేష ప్రసంగాలకు వ్యతిరేకంగా దాఖలైన ఓ పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారణ చెపట్టింది. ఈ సందర్భంగా విద్వేష ప్రసంగాలకు సంబంధించి 18 కేసులు నమోదు చేసినట్లు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కేవలం కేసులతో సమస్య పరిష్కారం కాదన్న ధర్మాసనం.. నమోదైన ఎఫ్ఐఆర్‌‌ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. దేశంలో మత సామరస్యాన్ని కాపాడుకునేందుకు విద్వేష పూరిత ప్రసంగాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేసింది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News