కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బిజెపికి వేసినట్లే : కేటీఆర్

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అని ఎప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ లో కలిసే వాడే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

Update: 2024-05-06 16:36 GMT

దిశ శంషాబాద్ : కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అని ఎప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ లో కలిసే వాడే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మద్దతుగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో నిర్వహించిన రోడ్ షోలో మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో నరేంద్ర మోడీతో దోస్తీ తెలంగాణలో కుస్తీ అన్నట్లు ఉంటే ఈ ప్రజలు ఎవరు నమ్మరు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 4వేల, పెన్షన్ మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్ సిలిండర్ అని చెప్పి ఐదు నెలలు గడుస్తున్న ఇప్పటికీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి బాగోగులు చూసుకుని అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందన్నారు. రంజాన్ కు రంజాన్ తోఫా దసరాకు బతుకమ్మ చీరల పంపిణీ లాంటివి సాంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ అందజేసింది అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక ఇక్కడ లంక బిందెలు ఉన్నాయని వస్తే ఖాళీ బిందెలే ఉన్నాయని మాట్లాడడానికి పట్టి చూస్తే ఖాళీ​ బిందెల కు ఎవరు చూస్తారో మీరే అర్థం చేసుకోవాలన్నారు.

కేంద్రంలో నరేంద్ర మోడీ 400 ఎంపీ సీట్లు గెలుస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఒకవేళ బిజెపి పార్టీకి 400 ఎంపీ సీట్లు వస్తే పెట్రోల్ డీజిల్ లీటర్ కు 400 రూపాయలు దాటుతుందన్నారు. దేవుడు పేరు చెప్పి ఓట్లను పరిస్థితి బీజేపీ నాయకులకు ఉంది. దేవుడు పేరు చెప్పి ఓట్లు ఆడుకోవాలంటే మన నాయకులు కేసీఆర్ కూడా యాదిగిరి గుట్ట దేవాలయాన్ని కట్టలేదా అన్నారు. బడుగు బలహీనవర్గాల వ్యక్తి బీసీల ముద్దుబిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.

చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ

అభివృద్ధి జరగాలంటే కేవలం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమన్నారు. పోరాడు తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని సంకల్పంతో కేసీఆర్ రైతులకు ఉచిత కరెంటు, ఇంటింటికి మిషన్ భగీరథ పథకం కింద త్రాగునీరు, మహిళలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, లాంటి పథకాలు ఎన్నో తీసుకువచ్చి పేద ప్రజల కొరకు నిరంతరం పోరాడారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అబద్దాల హామీలు ఆరు గ్యారెంటీల పథకాన్ని తీసుకువచ్చి ఐదు నెలలైనా నెరవేర్చలేదన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపిలకు బుద్ధి చెప్పి కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, కార్తీక్ రెడ్డి, గణేష్ గుప్తా, మున్సిపల్ చైర్ పర్సన్లు సుష్మారెడ్డి, రేఖ యాదగిరి, వైస్ చైర్మన్లు బండి గోపాల్ యాదవ్,వెంకటేష్ యాదవ్, శంషాబాద్ ఎంపిపి జయమ్మ శ్రీనివాస్, జడ్పిటిసి నీరటీ తన్వీరాజ్, పార్టీ అధ్యక్షులు దూడల వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో తరలించారు.

Similar News