ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల పాత్ర అత్యంత కీలకం : ఎమ్మెల్యే కసిరెడ్డి

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ప్రతినిధులకు ఎల్లప్పుడూ సహకరిస్తూ అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

Update: 2024-05-18 13:24 GMT

దిశ, తలకొండపల్లి : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ప్రతినిధులకు ఎల్లప్పుడూ సహకరిస్తూ అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మండల సర్వ సభ సమావేశానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ,జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం సమావేశం ప్రారంభమైన వెంటనే వ్యవసాయ శాఖ అధికారి రాజు ప్రసంగిస్తూ… ఉండగా జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ రైతులకు గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు 90 శాతం సబ్సిడీపై స్పిన్గ్లర్ పైపులు అందించారని గుర్తు చేశారు. గ్రామాలలో ఆవులు చనిపోయిన ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వలేదని, పాల బిల్లుల లో ఇన్సెంటివ్ కూడా చాలా గ్రామాలకు అధికారుల తప్పిదం వల్ల నష్టం జరిగిందని ఎమ్మెల్యేకు సూచించారు.

అనంతరం ప్రాథమిక వైద్యాధికారులు మాట్లాడుతూ.. హాస్పిటల్ మొత్తం శిథిలావస్థకు చేరుకుందని, వర్షం వస్తే నీరు మొత్తం లోనికి ప్రవేశించి రోగులకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అని సభ దృష్టికి తీసుకొచ్చారు. మండల మహిళా సమాఖ్య అధికారి శ్రీదేవి తమ ఎజెండా చదువుతుండగా గ్రామాలలో మహిళా సంఘాల నుండి తీసుకున్న డబ్బులను సుమారు రెండు లక్షల వరకు బ్యాంకులో చెల్లించకుండా మోసం చేశారని, పిఎసిఎస్ చైర్మన్ కేశవరెడ్డి, ఎంపిటిసి రమేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. లింగరావుపల్లి, రామకృష్ణాపూర్ గ్రామాల సంఘాలు జిల్లాలోనే మొట్టమొదటి స్థానంలో ఉండేవని కేశవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో విద్య వ్యవస్థ బలోపేతం చేయాలని, చాలా గ్రామాలలో ఇళ్లపై నుండి విద్యుత్ లైన్లు వెళ్లాయని వాటిని వెంటనే తొలగించి పేదలకు న్యాయం చేపట్టాలని జడ్పిటిసి వెంకటేష్ అన్నారు.

అనంతరం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గంలోని మిషన్ భగీరథ స్కీం లోని లోపాలన సరి చేయడానికి సుమారు రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని అన్నారు. మండల సభ సమావేశం కొనసాగుతుండగానే కొంతమంది అధికారులు బాధ్యతారహితంగా మధ్యలో నుండి వెళ్లిపోవడం ఏమిటని సంబంధిత అధికారి ఎంపీడీవో పై ఎమ్మెల్యే కసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందని, రైతుబంధు రాని రైతులు ఎవరైనా ఉంటే కేవైసీ అప్డేట్ చేసుకోవాలని, నాక్కూడా రైతుబంధు రాలేదని ఎమ్మెల్యే సభ్యులకు సూచించారు.

కొంతమంది ఎంపీటీసీ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు అధికారులు కూడా సమన్వయంతో వారు చెప్పే సమస్యలను తెలుసుకొని పరిష్కరించవలసి ఉంటుందని, ప్రజలు కూడా ప్రజా ప్రతినిధులను నమ్ముకుని ఓట్లు వేసి గెలిపించారని గుర్తు చేశారు. కరెంటు విషయంలో అధికారులు జాగ్రత్తగా ఉండి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు. గట్టు ఇప్పలపల్లి గ్రామానికి ఆర్టిసి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ తాలూకా గౌడ సంఘం కన్వీనర్ అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో జెడ్పిటిసి వెంకటేష్, ఎమ్మెల్యే కసిరెడ్డికి వినతి పత్రం అందజేశారు.కార్యక్రమంలో జడ్పిటిసి ఉప్పల వెంకటేష్, పిఎసిఎస్ చైర్మన్ కేశవరెడ్డి, ఎంపీడీవో శ్రీకాంత్ ,తహసీల్దార్ రంగారెడ్డి, ఎంఈఓ సర్దార్ నాయక్, మండల ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఎంపీటీసీ సభ్యులు రఘు, సుధాకర్ రెడ్డి, రమేష్, సరిత, హేమ, సోనీ, ఇమ్రాన్, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Similar News