ప్రజల కోసం కోట్లాడటానికి ఎమ్మెల్యే పదవి ఒక్కటి చాలు : సబితా ఇంద్రారెడ్డి

ప్రభుత్వం ఉంటేనే పని చేయాల్సిన అవసరం లేదని, ప్రతిపక్షంలో ఉన్న కొట్లాడి సాధించుకునే శక్తి ప్రజలు నాకు ఇచ్చారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

Update: 2024-05-09 09:40 GMT

దిశ, ఆర్కెపురం : ప్రభుత్వం ఉంటేనే పని చేయాల్సిన అవసరం లేదని, ప్రతిపక్షంలో ఉన్న కొట్లాడి సాధించుకునే శక్తి ప్రజలు నాకు ఇచ్చారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నగర్ లో ర్యాలీ నిర్వహించి కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యలపై కొట్లాడుతానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పై 60,000 వేల ఓట్ల మెజార్టీ తో గెలిచానని, ప్రజల కోసం కొట్లాడటానికి ఎమ్మెల్యే పదవి ఒకటి చాలని ఎమ్మెల్యే సబితా తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను మర్చిపోయి కేసీఆర్ ని తిట్టడానికి మంత్రులు పోటీ పడుతున్నారన్నారు.

కార్యకర్తల,నాయకుల బలంతో మహేశ్వరం నియోజకవర్గాన్ని సబితా ఇంద్రారెడ్డి కి కంచుకోటగా మార్చారని తెలిపారు. పాలనను గాలికి వదిలేసి కేవలం కండువలను కప్పడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మోసపూరితమైన వాగ్దానాలు ప్రజలకు ఇచ్చారని ఆ విషయం ప్రజలకు తెలిసిపోయిందని ఎమ్మెల్యే సబిత తెలిపారు. మళ్లీ కేసీఆర్ పాలన కావాలంటే కాసాని జ్ఞానేశ్వర్ కి ఓట్లు వేసి గెలిపించాలని సబితా రెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News