భవిష్యత్తులో చిరుధాన్యాలపై ఆధారపడాలి: సీడీపీఓ సక్కుబాయి

భవిష్యత్తులో చిరుధాన్యాలపై ఆధారపడాల్సి వస్తుందని, చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల... Latest News

Update: 2023-03-25 13:44 GMT

దిశ, ఆమనగల్లు: భవిష్యత్తులో చిరుధాన్యాలపై ఆధారపడాల్సి వస్తుందని, చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ఐసీడీఎస్ ఆమనగల్ ప్రాజెక్టు అధికారిని సీడీపీఓ సక్కుబాయి పేర్కొన్నారు. శనివారం ఆమనగల్ పట్టణ కేంద్రంలోని కస్తూరిబా బాలికల ఉన్నత పాఠశాలలో పోషణ పక్షము సందర్భంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు. విద్యాలయంలోని బాలికలతో చిరుధాన్యాలపై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సీడీపీఓ సక్కుబాయి మాట్లాడుతూ చిరుధాన్యాలను మన ఆహారపు అలవాట్లలో భాగం చేసుకోవడం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. చిరుధాన్యాలు సంపదతో సమానమని, మనం తీసుకునే ఆహారంలో కచ్చితంగా చిరుధాన్యాలు ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఎస్ఓ పద్మజ్యోతి, ఐసీడీఎస్ సూపర్వైజర్స్ శబరి, జయమ్మ, సరళ, పార్వతి, పద్మ, బాలమణి, తిరుమల, కేజీబీవీ ఉపాధ్యాయురాలు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News