తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి: చేవెళ్ల ఎమ్మెల్యే

దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం... Kalayna Laxmi Cheques Distributed

Update: 2023-03-25 13:29 GMT

దిశ, మొయినాబాద్: దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పేర్కొన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నక్షత్రం జయంత్ అధ్యక్షతన రూ. కోటి ఎనిమిది లక్షల 12,528 లు విలువగల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆడపిల్లల పెళ్లిళ్ల ఖర్చు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకాలు ప్రతి పేదవాడి కుటుంబానికి పెద్దన్నలాగా కేసీఆర్ సహకారం అందించి ప్రతి పేదవాడి ముఖంలో వెలుగు చూసే విధంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అశోక్ కుమార్, వినయ్ సాగర్, ఎంపీడీవో సంధ్య, వైస్ ఎంపీపీ మమతా కృష్ణ యాదవ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Tags:    

Similar News