వ్యవసాయ కోర్సులు చదివే అవకాశం రావడం చాలా అదృష్టం: త్రినాధ్ కుమార్

వ్యవసాయ కోర్సులు చదివే అవకాశం నాకు రావడం చాలా అదృష్టం అని ఐఎఫ్ఎస్ అధికారి త్రినాధ్ కుమార్

Update: 2023-03-18 13:11 GMT

దిశ శంషాబాద్ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ని రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల కాలేజ్ డే వేడుకలు శనివారం ఉత్సాహ భరితం గా జరిగాయి.రాజేంద్ర నగర్ లోని వర్సిటీ ఆడిటోరియం లో ఇవి రోజంతా సందడి సందడిగా సాగాయి.ఈ వేడుకలలో ఐ ఎఫ్ ఎస్ అధికారి త్రినాధ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఈ కళాశాల నుంచి గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నట్లు ఆయన తెలిపారు.వ్యవసాయ కోర్సులు చదివే అవకాశం రావడం చాలా అదృష్టం అని అభిప్రాయపడ్డారు . ప్రతి మనిషి జననం నుండి మరణం వరకు అనుక్షణమూ ఆహారం పైననే ఆధారపడతారని కావున అటువంటి వృత్తి లో ఉండటానికి గర్వం గా భావించాలని అన్నారు. పిజె టిఎస్ ఎయు రిజిస్టర్ డాక్టర్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి జీవితం లో ఇటువంటి కాలేజీ డేలు తీపి గుర్తులు గా మిగిలిపోతాయని వ్యాఖ్యానించారు.

స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి వ్యవసాయ ఉత్పత్తి,ఉత్పాదకత ల లో దేశం మంచి పురోగతి సాధించిందని ఆయన అన్నారు.నేడు వ్యవసాయ రంగం అనేక కొత్త సవాళ్లు ఎదుర్కొంటున్నదని తెలిపారు.సహజ వనరులను పరిరక్షిస్తూ పెరుగుతున్న జనాభా అవసరాలకి అనుగుణం గా ఉత్పత్తి,ఉత్పాదకతలు పెంచాల్సిన అవసరముందన్నారు.అదే విధం గా డ్రోన్,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన టెక్నాలజీ ని వ్యవసాయం లో విరివిగా ఉపయోగించాలన్నారు.ఐకార్ సూచనలకు అనుగుణంగా ప్రతి ఏటా సీట్లని కూడా పెంచుతున్నట్లు సుధీర్ కుమార్ వివరించారు. అనంతరం సాంస్కృతిక,క్రీడా,వ్యాసరచన తదితర పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.విద్యార్థిని,విద్యార్థులు చేసిన కళా ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వర్సిటీ పీజీ స్టడీస్ డీన్ డాక్టర్ అనిత,డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ సీమ,రాజేంద్రనగర్ కళాశాల అసోసియేట్ డీన్ నరేందర్ రెడ్డి,కళాశాల విద్యార్థి వ్యవహారాల ఇన్ ఛార్జ్ రవీంద్ర నాయక్,ఫాకల్టీ సభ్యులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Similar News