Teegala Krishna Reddy : బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి తీగల కృష్ణారెడ్డి

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది...

Update: 2023-07-18 12:45 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మహేశ్వరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పనున్నారు. తీగలతో పాటు ఆయన మేనకోడలు అనితారెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అనితా రెడ్డి రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా పని చేస్తున్నారు. తీగలతో పాటు ఆమె కూడా ఇప్పటికే కాంగ్రెస్ వ్యవహాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయి పార్టీలో చేరికపై చర్చించారు.


కాగా తీగల కృష్ణారెడ్డి టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ మేయర్‌గా పని చేశారు. 2009 ఎన్నికల్లో మహేశ్వరం నియోకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం బీఆర్ఎస్‌లో చేరారు. 2018లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు.


అయితే మహేశ్వరం నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్‌లో చేరి మంత్రిగా పని చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో ఆదిపత్య పోరు కొనసాగింది. ఈ క్రమంలో ఆయనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిందని అసంతృప్తి చెందారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. త్వరలో ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Tags:    

Similar News