Chief Minister of Telangana : అధికారిక ప్రకటన: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.

Update: 2023-12-05 13:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: నరాలు తెగే ఉత్కంఠకు కాంగ్రెస్ తెరదించింది. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినే ఫైనల్ చేస్తూ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. కాగా, తెలంగాణకు రేవంత్ రెడ్డి రెండో ముఖ్యమంత్రిగా నియామకం అయ్యారు. ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ లభించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 60 సీట్లు కావాల్సి ఉండగా.. కాంగ్రెస్‌కు ప్రజలు 64 సీట్లు కట్టబెట్టారు. బీఆర్ఎస్‌కు 39 సీట్లు, బీజేపీకి 8, ఎమ్ఐఎమ్‌కు 7, సీపీఐకి 1 స్థానాల్లో అవకాశం ఇచ్చారు.

అయితే, ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ ఉండటంతో అధిష్టానం అందరితో రెండ్రోజుల పాటు సుదీర్ఘ మంతనాలు జరిపి రేవంత్ రెడ్డిని ఫైనల్ చేసింది. మరోవైపు రేవంత్ రెడ్డి సీఎంగా.. డిసెంబర్ 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 7వ తేదీన గురువారం మంచి ముహూర్తం ఉండటంతో పార్టీ ఆ రోజునే ఫైనల్ చేసింది. మరోవైపు రేవంత్ రెడ్డితో పాటు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఆసక్తిగా మారింది. 

Read more: For Special Edition on Telangana Chief Minister Revanth reddy

Read more : రేవంత్ రెడ్డికి హైకమాండ్ పిలుపు.. హుటాహుటిన ఢిల్లీకి!

Tags:    

Similar News