ప్రైవేటు వ్యక్తుల వద్దే రైతుల పహానీలు

వీఆర్ఏలు తమకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సమ్మెబాట పట్టడంతో తాసిల్దార్ కార్యాలయాలు సమస్యలతో సతమతమవుతున్నాయి.

Update: 2022-09-28 15:43 GMT

దిశ, మాక్లుర్ : వీఆర్ఏలు తమకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సమ్మెబాట పట్టడంతో తాసిల్దార్ కార్యాలయం సమస్యలతో సతమతమవుతుంది. ఈ తరుణంలో పహానిలోని సమస్యలు పరిష్కరించడానికి ప్రైవేటు వ్యక్తుల్ని ఆశ్రయించాల్సిన అవసరం ఏర్పడింది. తాసిల్దార్ కార్యాలయం తమ అవసరాల నిమిత్తం ప్రైవేట్ వ్యక్తులను నియమించుకొని పహానీలు ఇతరేతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

మండల కార్యాలయంలోని క్యాస్ట్ ,ఇన్కమ్ ఇతర సర్టిఫికెట్ల కోసం ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తుంది. దీంతో సమస్యలు పరిష్కరించాలంటే పైకం చెల్లించాల్సిందే అన్నట్టుగా మండల కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులు వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీఆర్ఏల సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రజలకు వీఆర్ఏలను అందుబాటులో ఉండేలా చేయాలని ప్రజలు అంటున్నారు. అన్ని రకాల సమస్యలను పరిష్కరించే దిశగా వీఆర్ఏలు పాటుపడతారని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News