పంచముఖి వీరాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజారోహణం

నగరంలోని వినాయక్ నగర్ లో గల శ్రీ పంచముఖి వీరాంజనేయ స్వామి దేవాలయంలో రెండు రోజులుగా విగ్రహ ప్రతిష్టకు సంబంధించి ఉత్సవాలను ఆలయకమిటీ, భజన బృందం, పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూన్నారు.

Update: 2023-02-03 15:09 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : నగరంలోని వినాయక్ నగర్ లో గల శ్రీ పంచముఖి వీరాంజనేయ స్వామి దేవాలయంలో రెండు రోజులుగా విగ్రహ ప్రతిష్టకు సంబంధించి ఉత్సవాలను ఆలయకమిటీ, భజన బృందం, పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూన్నారు. శుక్రవారం ధ్వజస్తంబారోహణ, శ్రీ విజయ గణపతి, శ్రీ దత్తాత్రేయ, నవగ్రహ సంతాన నాగేంద్రుల వారి ప్రతిష్ట, కుంబాభిషేకం మధుసూదనానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా నిర్వహించారు. అనంతరం పూజలో నగర మేయర్ నీతూ కిరణ్, స్థానిక కార్పొరేటర్లు మల్లేష్ యాదవ్, ఉమారాణీ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మధుసూదనానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ ప్రజలందరూ భక్తి మార్గంలో నడవాలని, ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలో భగవంతుడు సాక్షాత్కరిస్తారని తెలిపారు. ఎవరైతే భగవంతుని పై దృష్టి సారించరో వారు ధార్మికమైన కార్యక్రమాలకు హాజరుకాలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి చైర్మన్ మల్లేష్ యాదవ్, కార్పొరేటర్ ఉమా రాణీ శ్రీనివాస్, పునర్నిర్మాణ కమిటీ సభ్యులు వాసు, దేవేంధర్, రఘు, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

Similar News