కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరనున్న ఎంపీపీ

కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. మాస్ లీడర్‌గా పేరున్న మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.

Update: 2024-05-09 03:39 GMT

దిశ, మాచారెడ్డి: కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. మాస్ లీడర్‌గా పేరున్న మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. బుధవారం అమావాస్య అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హడావిడి చేసి ఈరోజు కామారెడ్డిలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్‌లో ఆయన చేర్చుకునేందుకు ఏర్పాట్లు చేశారు. మాచారెడ్డి మండలం లో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన నర్సింగరావు చేరిక వల్ల గతంలో గంప గోవర్ధన్ ఎన్నికల్లో విజయం సాధించినట్లు పేరుంది. కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్‌లో నర్సింగరావు కలిసిన సందర్భంగా ఆయనకు పదోన్నతి గురించి ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ పూర్తిగా విస్మరించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేసిన తర్వాత కవితతో నామినేషన్ వేయించి అవమానానికి గురి చేసింది. మాచారెడ్డి మండలంలో ఎంపీపీగా తనకున్న హోదాకు గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారు.

కానీ స్థానికంగా నర్సింగరావుకు పోటీగా గ్రూప్‌లను ఏర్పాటు చేసి నర్సింగ్ రావు అనుచరులను గత అసెంబ్లీ ఎన్నికల్లో సస్పెన్షన్ కు గురిచేసినా భరించారు. సస్పెన్షన్ గురిచేసిన మాచారెడ్డి వైస్ ఎంపీపీ జీడిపల్లి నర్సింహారెడ్డి, దేవుని పల్లి సర్పంచ్ అరవింద్ లను తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడం ఎంపీపీని మానసికంగా కుంగదీసింది. నీ అనుచరులను సస్పెండ్ చేస్తే నిన్ను చేసినట్లేనని నర్సింగరావు శ్రేయోభిలాషులు చెప్పినా వినకుండా బీఆర్ఎస్‌లోనే కొనసాగారు. ప్రస్తుతం ఎంపీ ఎన్నికల్లో ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం, గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు గ్రూపులను మాచారెడ్డి మండలం లో ఏర్పాటు చేయడం, ఇటీవల మాచారెడ్డి బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుని నియామకం గురించి సమాచారం లేకపోవడం వంటి కారణాలను సమీక్షించి తన అనుచరుల కోరిక మేరకు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. మొత్తం మీద కామారెడ్డిలో బీఆర్ఎస్ కు గడ్డు పరిస్థితులకు కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప వైఖరే కారణమని చర్చించుకుంటున్నారు.

Similar News