ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్.. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్న తరుణంలో..

Update: 2023-05-22 02:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్న తరుణంలో.. రానున్న మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలంగాణ వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది.

అయితే గత రెండు రోజుల నుంచి తేలిక పాటి వర్షాలు పడుతున్నప్పటికీ.. వచ్చే మూడు రోజులు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నారాయణపేట, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Tags:    

Similar News