తడిసిన ధాన్యాన్ని కూడా గిట్టుబాటు ధరకే కొంటాం: డీఎస్ చౌహాన్

అకాల వర్షాలతో ధాన్యం తడవంతో ఆందోళనలో ఉన్న రైతులకు పౌర సరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్ గుడ్ న్యూస్ తెలిపారు.

Update: 2024-05-09 04:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: అకాల వర్షాలతో ధాన్యం తడవంతో ఆందోళనలో ఉన్న రైతులకు పౌర సరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్ గుడ్ న్యూస్ తెలిపారు. సరైన సమయానికి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినప్పటికి కాంట చేయడంలో ఆలస్యం కావడంతో అకాల వర్షం పడి ధాన్యం తడిసి పోయిన సంగతి తెలిసిందే. దీంతో రైతుల పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్న క్రమంలో.. డీఎస్ చౌహాన్ జగిత్యాలలోని రామన్నపేట, గంగాధర, కొత్తపల్లి, మల్యాల కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, తేమ పేరుతో కోత పెట్టే అవకాశమే లేదని, ఎంఎస్పీ (కనీస గిట్టుబాటు ధర)కే కొంటుందని రైతులకు హామీ ఇచ్చారు.

Similar News