విలువలతో కూడిన విద్యా బోధనే శ్రీరామ్ హై స్కూల్ ధ్యేయం : పాఠశాల చైర్మన్ చంద్రయ్య

విలువలతో కూడిన విద్యా బోధన అందించడమే శ్రీ రామ్ హై స్కూల్ ధ్యేయం అని ఆ పాఠశాల చైర్మన్ చంద్రయ్య తెలిపారు.

Update: 2022-12-06 17:06 GMT

దిశ, కుత్బుల్లాపూర్ : విలువలతో కూడిన విద్యా బోధన అందించడమే శ్రీ రామ్ హై స్కూల్ ధ్యేయం అని ఆ పాఠశాల చైర్మన్ చంద్రయ్య తెలిపారు. దేశంలోని పలు నగరాలలో ప్రతీ సంవత్సరం గీతాజయంతి ఉత్సవాలు సంస్కృత ప్రచార పరిషత్ సంస్థలు నిర్వహిస్తాయి. అందులో భాగంగా హైదరాబాద్ నగరంలో సంస్కృతి ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గీతాజయంతి వేడుకలలో నగరంలో పలు విద్యాసంస్థలు పాల్గొన్నాయి. ఈ ఉత్సవాలలో పాల్గొన్న బాచుపల్లి శ్రీరామ్ హై స్కూల్ విద్యార్థులు పలు విభాగాలలో ప్రతిభ కనబరిచారు. శ్రీరామ్ పాఠశాల విద్యార్థులు అబ్బురపరిచే ప్రతిభ కనబరిచి ఓవరాల్ ఛాంపియన్ షిప్ ట్రోపిని గెలుచుకున్నారు. 9వ తరగతి చదువుతున్న వైష్ణవి,7 వ తరగతి చదువుతున్న సాహితీ భగవద్గీత పఠనంలో ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు. కార్యక్రమంలో శ్రీరామ్ హై స్కూల్ డైరెక్టర్ కొన్నె శ్రీకాంత్, ప్రిన్సిపాల్ తనుశ్రీ, ఉపాధ్యాయులు సీత, శారద, అనూష, శారద, నాగమణి, కోమలి, హరిప్రియ పాల్గొన్నారు.

Similar News