మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయండి : హరీష్ రావు పిలుపు

బీఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్ సభ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా..ఈ నెల 8వ తేదీ సాయంత్రం పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో ను జయప్రదం చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ శ్రేణులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Update: 2024-05-06 13:03 GMT

దిశ,పటాన్ చెరు :  బీఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్ సభ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా..ఈ నెల 8వ తేదీ సాయంత్రం పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో ను జయప్రదం చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ శ్రేణులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ రోడ్ షోపై సోమవారం పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్యులతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలు, డివిజన్లు, మున్సిపాలిటీల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు రోడ్ షో కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలని ఆయన సూచించారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. ప్రతిరోజు గడపగడపకు వెళ్లి పార్టీ ప్రచారాన్ని విస్తృతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News