పేద ప్రజల భూములు గుంజుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు

రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ ధరణి అమల్లోకి తెచ్చి పేద ప్రజల భూములు గుంజుకున్నారని ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు.

Update: 2024-05-04 15:54 GMT

దిశ, శివ్వంపేట : రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ ధరణి అమల్లోకి తెచ్చి పేద ప్రజల భూములు గుంజుకున్నారని ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. శనివారం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన రోడ్ షో లో ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాలుగు నెలలు గడిచినా ప్రభుత్వం ప్రవేశపెట్టిన హామీలు ప్రజలకు అందలేదని, నెల గడవగానే రేవంత్ రెడ్డికి జీతం తీసుకోవడం తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం తెలవదని అన్నారు. కేసీఆర్ కు 100 కోట్లు, హరీష్ రావుకు 100 కోట్లు ఇచ్చి వెంకట్రామిరెడ్డి ఎంపీ టికెట్ తెచ్చుకున్నారని, మదన్ రెడ్డి దగ్గర పైసలు లేవు కాబట్టి టికెట్ ఇవ్వలేదని అన్నారు.

     బీఆర్ఎస్ నాయకులు మట్టి అమ్ముకున్నోళ్లు ఇసుక అమ్ముకున్నోళ్లు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మారుతున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి 2014లో పోటీ చేసినప్పుడు సునీత రెడ్డి కాంగ్రెస్ లో ఉండే ఆయన అక్కడ ఆమె ఇక్కడ పార్టీలు మారారన్నారు. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 4వేలు ఉన్న ఎల్ఈడీ లైట్ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 350 రూపాయలకే ఎల్ఈడి లైట్లు అందించారని, 500 సంవత్సరాలుగా మనం కోరుకున్నటువంటి రామ మందిరం కట్టించిన ఘనత మోడీ దే అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, అసెంబ్లీ కన్వీనర్ రమణారావు, కౌన్సిలర్ బుచ్చేష్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు పెద్దపులి రవి, మండల ఉపాధ్యక్షులు వినోద్, ప్రధాన కార్యదర్శి అశోక్ సాదుల, బీజేవైఎం నాయకులు బల్కంపేట భాస్కర్, వంజరి శ్యామ్, శ్రీధర్ గౌడ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

Similar News