బాలికలకు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు ల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు ఆహ్వానం

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గాభాయి దేశముఖ్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల హైదరాబాద్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి సావిత్రి ప్రకటనలో తెలిపారు.

Update: 2024-04-27 10:15 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గాభాయి దేశముఖ్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల హైదరాబాద్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి సావిత్రి ప్రకటనలో తెలిపారు. సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా, కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

అనాథ, వసతి గృహములలో, ఇతర స్వచ్చంధ సంస్థలలో ఉంటూ 10 వ తరగతి పూర్తి చేసినటువంటి అనాథ, పాక్షిక అనాథ, నిరుపేద, తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి గురైన, అక్రమ రవాణాకు గురైన బాధిత బాలికల కోసం ఎటువంటి అర్హత పరీక్ష లేకుండా, నేరుగా పాలిటెక్నిక్ డిప్లొమా కోర్స్ నందు ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి తెలిపారు. మే 15 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం సిద్దిపేట కలెక్టరేట్ లోని జిల్లా బాలల పరిరక్షణ విభాగంలో లేదా 9000357750 లో సంప్రదించాలని సూచించారు.

Similar News