బూటకపు ఎన్‌కౌంటర్‌లను ఖండించండి.. మావోయిస్టుల సంచలన లేఖ

ఏప్రిల్ చివరి వారంలోకాల్పులు జరిపి నలుగురు ఆదివాసి రైతులను నిర్దాక్షిణ్యంగా హత్య చేశారని మావోయిస్టు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.

Update: 2024-05-06 07:34 GMT

దిశ, బ్యూరో కరీంనగర్ : ఏప్రిల్ చివరి వారంలో గాలింపుల పేరుతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా కాకూర్ -టేకుమట్ట చేరుకున్న వేలాది పోలీసులు తమ సంప్రదాయం ప్రకారం పండుగ జరుపుకోవడానికి గుమ్మి గూడిన ప్రజలపై కాల్పులు జరిపి నలుగురు ఆదివాసి రైతులను నిర్దాక్షిణ్యంగా హత్య చేశారని మావోయిస్టు పార్టీ పశ్చిమ డివిజన్ సభ్యులు బ్యూరో (గడ్చిరోలి) దండకారణ్యం స్పెషల్ జోన్ అధికార ప్రతినిధి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు పోలీసులు విరామం లేకుండా కాల్పులు జరిపారని, పోలీసుల కాల్పులతో బీతిల్లిన ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెత్తరని, అయినప్పటికీ పోలీసులు జంతువుల ను తరిమినట్టు తరుముతూ వెంటాడుతూ హత్య చేశారన్నారు.

ఈ పాశవిక హత్యలను ఖండించాలని, నిజాలను ప్రపంచానికి వెల్లడి చేయాలని నేరస్తులైన పోలీసు ఉన్నతాధికారులను శిక్షించాల్సిందిగా డిమాండ్ చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో, ప్రజాస్వామిక వాదులకు, హక్కుల కార్యకర్తలకు ఆదివాసీ శ్రేయోభిలాషులకు, ఆదివాసీ సంఘాలకు పిలుపునిచ్చింది. అడవిలోని వేరువేరు చోట్ల పోలీసుల కాల్పులతో విరోచితంగా పోరాడిన అమరులకు వినమ్రంగ తలవంచి విప్లవ జోహార్లు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఆరోజు జరిగిన వాస్తవమేమంటే కాకూర్, మంగి ,వేడ గ్రామాల ఆదివాసి రైతులు తమ సంప్రదాయం ప్రకారం పండుగ జరుపుకోవడానికి ఆరోజు ఉదయమే అడవిలో కలిశారన్నారు.

అప్పటికే ఆ ప్రాంతాన్ని నలు వైపుల నుండి చుట్టుముట్టిన పోలీసులు హఠాత్తుగా ఆ సమావేశంపై కాల్పులకు పాల్పడ్డారన్నారు. పోలీసుల కాల్పులలో నలుగురు రైతులు కామ్రేడ్స్ కోవాచి పాండు, టేకమెట్ట (భార్య పేరు సోనీ ) మైనో కొర్స, మంగే వెడ, లాల్సు కోవాసి, (టేకమెట్ట భార్య పేరు సుశీల )రాములు నారోటి, టేక మెట్ట (భార్య పేరు నీలా )అసువులు బాసారని తెలిపారు. గ్రామ రైతులను పాశవికంగా హత్య చేయడాన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తుదంని పేర్కొన్నారు. అడవిలోని వేరువేరు చోట్ల గేరిల్లాలపై జరిగిన కాల్పులలో ఆరుగురు విప్లవకారులు అమరులయ్యారని, వారు కామ్రేడ్స్ జోగన్న రీజినల్ కమిటీ సభ్యుడు,(చీమల నరసయ్య వడకపల్లి పెద్దపల్లి జిల్లా తెలంగాణ) వినయ్ పిపిసి మెంబర్ (‌బెల్లంపల్లి అదిలాబాద్ ) మల్లేష్ సివైపిసి మెంబర్. (మల్లెపాడ బీజాపూర్ జిల్లా) సరిత పియం (కోజ్జూర్ వెటంపాడు తాలూకా నారాయణపూర్ జిల్లా) సింధు ఏ సీఎం (‌ముస్రాం గూడా ఏటపల్లి తాలూకా గడ్చరోలి) చిలక పియం (కోమటిపల్లి బీజాపూర్ జిల్లా) ఈ ఆరుగురి అమరులయ్యారని వివరించారు.

బంధుమిత్రులకు ఈ వార్త చేరడంతో వారంతా ఎంతో దుఖంలో మునిగిపోయారని,తమ ప్రియమైన వారు ప్రజల కోసం నిస్వార్ధంగా పనిచేసి తమ జీవితాలను అర్పించారని, వారి త్యాగాలను కొనియాడుతూ వారి ఆదర్శాలను ఎత్తిపట్టాలని, పోలీసుల పాశవిక హత్యకాండను ఆపరేషన్ కాగార్ ను ఖండించాలని పార్టీ కోరడం జరుగుతుందన్నారు. 60 ఏళ్ళు పైబడిన కామ్రేడ్ జోగన్న చుట్టుముట్టిన పోలీసుల వలయాలను చీల్చుకుంటూ బయటపడే క్రమంలో చివరకు ప్రచండ వేడికి తట్టుకోలేక అలసిపోయి నడవలేని స్థితిలో పోలీసులకు సజీవంగా దొరికాడని, అప్పటికే ఆయన తన వద్ద నున్న ఏకే47 ఆయుధాన్ని సహచర కామ్రేడ్స్‌కు అప్పగించాడని తెలిపారు.

నిర్దాక్షిణ్యంగా తమ చేతికి చిక్కిన విప్లవకారున్ని పోలీసులు అత్యంత పాశవికంగా హత్య చేశారని మండిపడ్డారు. ఇలాంటి హత్యలతో ప్రజలలో విప్లవకారులలో ఒక బయోత్పాత వాతావరణాన్ని సృష్టించాలని పోలీసులు భావిస్తున్నారని మండిపడ్డారు. కానీ నిజానికి ఇది పోలీసులు, రాజ్యం చేస్తున్న పాషవికతను వెల్లడి చేస్తూ వారికి వ్యతిరేకంగా ప్రజాగ్రహాన్ని మూట కట్టుకోవడానికి దారితీస్తుందని, ఇలాంటి పాసవిక చర్యలను ఖండిస్తూ భారత విప్లవోద్యమాన్ని కాపాడుకోవడానికి ధైర్యంగా ముందుకు రావాల్సిందిగా మా పార్టీ విప్లవ వర్గాల ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు.

Similar News