సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

పార్లమెంట్ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సమీపిస్తుండటంతో సామాన్య ప్రజలు అత్యధికంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తుంటారు.

Update: 2024-03-28 12:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సమీపిస్తుండటంతో సామాన్య ప్రజలు అత్యధికంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో 100 రోజుల పనిలో పాల్గొనే కూలీల వేతనాలు 4 నుంచి 10 శాతం వరకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో రోజువారీ కూలీలో భాగంగా పని చేసే వారికి వేతనాలు పెరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 28 పెరగ్గా.. మొత్తం రోజు కూలీ విలువ రూ. 300 లకు చేరకుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అత్యధికంగా హరియాణాలో రోజు కూలి రూ. 374 రూపాయలు పొందుతుండగా.. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో అత్యల్పంగా.. రూ.234 రూపాయలు అందుకుంటున్నారు. కాగా ఈ రోజు పెంచిన రోజువారి కూలీల వేతనాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

Similar News