మన్నెవారిపల్లిలో బీఆర్ఎస్ ప్రచారాన్ని అడ్డుకున్న గ్రామస్తులు

నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలోని

Update: 2024-05-06 10:56 GMT

దిశ,అచ్చంపేట : నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలోని అచ్చంపేట మండలం మన్నె వారి పల్లి గ్రామానికి సోమవారం మధ్యాహ్నం తర్వాత ప్రచారానికి వెళ్లిన బారాస పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రచారాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. గత ఎన్నికల ముందు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా మన్నె వారి పల్లి గ్రామానికి చెందిన రైతుల భూములు కోల్పోవడంతో వారికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా మన్నె వారిపల్లి ప్రజలకు మెరుగైన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అందజేస్తానని హామీ ఇచ్చావని కానీ... హామీ ఏమాత్రం అమలు కాలేదని, అమ్ములను మోసం చేశావని మల్లెందుకు ప్రచారానికి వచ్చావని నిరసన వ్యక్తం చేస్తూ గ్రామస్తులు ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఇరు పార్టీల మధ్య తోపులాట ఉద్రిక్తత..

బారాస పార్టీ ఎంపీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ గెలిపించాలని మన్నె వారి పల్లి గ్రామానికి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రచార నిమిత్తం మెల్లగా గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడంతో కాసేపు బారాస కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట చేసుకుని ఉద్రిక్తత ఏర్పడింది. పరిస్థితి చేయి దాటిపోక ముందే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు పార్టీల వారిని నచ్చ చెప్పే ప్రయత్నం చేసి ఘర్షణ వాతావరణాన్ని లేకుండా చర్యలు తీసుకున్నారు. తదుపరి ప్రచారం లో బాలరాజు మాట్లాడుతూ తాటాకు చప్పులకు భయపడేది లేదని, ప్రాణం పోయినా ప్రజల కోసం పనిచేస్తానని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను విస్మరించి ప్రజలను మోసం చేసిందని ప్రజా సమస్యలను పార్లమెంట్ లో మీ గొంతు గా ఉండాలంటే బారాస పార్టీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని ఆదరించాలని, అందుకు ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రచారం చేసుకునే హక్కు అందరికీ ఉంటుందని అడ్డుకోవడం సమంజసమా, అధికారంలో ఉన్నప్పుడే మీలాంటి వారికి తగిన సమాధానమిచ్చానని నేడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీ ఆటలు సాగనివ్వకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తానన్నారు.

Similar News