పరిగి వ్యవసాయ మార్కెట్: వేసవి వానలకే ఇలాగైతే.. వాన కాలం వానలకెలా..?

అధికారుల ఆలోచనలేని విధానం వల్ల పరిగి వ్యవసాయ మార్కెట్ యార్డు మురుగు నీటి కుంటగా తయారైంది.

Update: 2023-04-30 12:40 GMT

దిశ, పరిగి: అధికారుల ఆలోచనలేని విధానం వల్ల పరిగి వ్యవసాయ మార్కెట్ యార్డు మురుగు నీటి కుంటగా తయారైంది. పరిగి వ్యవసాయ మార్కెట్​ కార్యాలయ ఆవరణలోని మార్కెట్​ యార్డ్​ మూడు రోజుల క్రితం కురిసిన మోస్తారు వర్షానికి మురుగునీటి కుంటగా తయారైంది. ఇటీవలే సీసీ రోడ్డు వేశారు. వర్షపునీరు వెళ్లేందుకు వీలుగా దారి వదలకపోవడంతో వర్షపు నీరంతా సీసీ రోడ్డు పక్కనే పొడువునా నీరు నిలిచి మురుగునీటి కుంటలా మారింది.

దీంతో మార్కెట్​ కు  వచ్చిన రైతులు, వినియోగదారులు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి వానలకే ఇలా వర్షపు నీరు నిలబడితే ఇక వర్షకాలం వానలకు చెరువులా మారుతుందేమో అని అనుకుంటున్నారు. ఇప్పటికైనా మార్కెట్​ అధికారులు స్పందించి వర్షపు నీరు మార్కెట్​ యార్డ్​ ఆవరణలో నిలబడకుండా చర్యలు చేపడితే బాగుంటుందని కమీషన్​ ఏజెంట్లు, ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News