సమస్యలపై గళమెత్తే వారినే ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలి..

విద్య, ఉపాధ్యాయ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని గళమెత్తి ప్రశ్నించే వ్యక్తులనే ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని తెలంగాణ రాష్ర్ట ఉపాధ్యాయ సంఘం ఎమ్మెల్సీ అభ్యర్థి బీ భుజంగరావు అన్నారు.

Update: 2022-12-06 13:04 GMT

దిశ, మక్తల్: విద్య, ఉపాధ్యాయ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని గళమెత్తి ప్రశ్నించే వ్యక్తులనే ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని తెలంగాణ రాష్ర్ట ఉపాధ్యాయ సంఘం ఎమ్మెల్సీ అభ్యర్థి బీ భుజంగరావు అన్నారు. మంగళవారం మక్తల్ పట్టణంలోని గురుకుల పాఠశాలలో టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభించి అనంతరం విలేకర్లతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ కుంటుపడిందని, పలు పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతతో ఒకే ఉపాధ్యాయుడితో పాఠశాల కొనసాగ లేక మూతపడే దశకు చేరుకున్నాయన్నారు. ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీలు రాష్ర్ట ప్రభుత్వానికి తొత్తులుగా మారారని, ఈ విషయాన్ని రాష్ట్ర ఉపాధ్యాయులు గమనించాలని అందుకు సరైన ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎన్నుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పర్వత్ రెడ్డి, రాంగోపాల్, వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Similar News