మహబూబ్‌నగర్ ఎంపీగా వంశీచంద్ రెడ్డిని గెలిపించుకుందాం : జడ్చర్ల ఎమ్మెల్యే

దేశ భవిష్యత్తు కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం అణగారిన కులాల రిజర్వేషన్ల

Update: 2024-05-06 14:52 GMT

దిశ,జడ్చర్ల : దేశ భవిష్యత్తు కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం అణగారిన కులాల రిజర్వేషన్ల భద్రత కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మహబూబ్నగర్ ఎంపీగా వంశీచంద్ రెడ్డి గెలిపించుకుందామని జడ్చర్ల ఎమ్మెల్యే జనం పల్లి అనిరుద్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జడ్చర్ల మండల పరిధిలోని రామస్వామి గుట్ట తండా, ఎక్కువైపల్లి, పెద్దదిరాళ, చిన్నాదిరాళ, కొండేడ్, కోడుగల్, లింగంపేట్, గోప్లాపూర్, నెక్కొండ, గంగాపురం, గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి కి మద్దతుగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో బిజెపి మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దు చేయడం ఖాయమని స్పష్టం చేశారు ఈ ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య జరగడం లేదని రిజర్వేషన్లను అమలు చేయడం అమలు చేయకపోవడం అనే అంశం మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని దేశంలో మళ్ళీ బీజేపీ పార్టీ గెలిస్తే భారత రాజ్యాంగాన్ని తీసేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని అన్నారు.

ఈసారి దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీల సంక్షేమానికి ఏ డోకా ఉండదని అన్నారు. గత పదేళ్లుగా దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ చేసింది ఏమీ లేదని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని ఆ పార్టీ నాయకులు తాను చేసిన పాపాల నుండి తమను తాను కాపాడుకునేందుకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులే బిజెపి పార్టీకి ఓటు వెయ్యమంటున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా హామీల మేరకు 6 గ్యారంటీలు 100% పూర్తి చేస్తామని పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ ఎంపీగా వంశీచంద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా జడ్చర్ల మున్సిపాలిటీ ఆరో వార్డు కౌన్సిలర్ సుంకసారి రమేష్, ఆలూరు మాజీ ఎంపీటీసీ నరసింహారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సూరిశెట్టి పవన్ కుమార్, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Similar News