బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద నగదు పట్టివేత.. లబోదిబో అంటున్న రైతులు..

మక్తల్ నియోజకవర్గం బోర్డర్ చెక్ పోస్ట్ ల వద్ద బుధవారం

Update: 2024-05-01 14:58 GMT

దిశ, మక్తల్: మక్తల్ నియోజకవర్గం బోర్డర్ చెక్ పోస్ట్ ల వద్ద బుధవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. నిరుపిత పత్రాలు లేని రూ.2, లక్షల 51,వేల నగదు పట్టేసినట్లు కృష్ణ ఎస్సై ఎండీ నవీద్ తెలిపారు.రాయచూర్ మార్కెట్ లో ధాన్యం అమ్మగా తీసుకొచ్చిన డబ్బులను పట్టుకోవడం అన్యాయమని రైతులు లబోదిబో అంటున్నారు. కృష్ణ బ్రిడ్జి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు వాహనాల తనిఖీలు నిర్వహించగా కర్ణాటక నుంచి తెలంగాణలోకి వస్తున్న పీఎన్ మురుగన్ బెంగళూరుకు చెందిన వ్యక్తితో రూ. లక్ష నగదు, అప్పి రెడ్డి పల్లి గ్రామానికి చెందిన బొక్క కృష్ణయ్య వద్ద రూ. 68 వేల నగదు, క్రిష్ణా మండలం చేగుంట చెక్ పోస్ట్ వద్ద శివ యాద్గిరి వద్ద రూ.83 వేల నగదుకు ఎలాంటి రసీదు లేనందున వాటిని గ్రివియస్ కమిటీకి పంపించడం జరిగిందని కృష్ణ ఎస్సై నవీద్ తెలిపారు. కృష్ణ చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో పట్టుబడిన నగదంతా రైతులు రాయచూర్ మార్కెట్ ధాన్యం అమ్ముకొగా వచ్చిన నగదును తీసుకొస్తుంటే పోలీసులు తనిఖీల పేరున తమ డబ్బును తీసుకోవడం ఎంతవరకు సమంజసమని అంటున్నారు. రాయచూర్ మార్కెట్ లో తక్ పట్టిల ఇవ్వకుండా బుక్క చిట్టిలు ఇస్తున్నారని వాటిని చూపించిన తనిఖీ అధికారులు ఒప్పుకోవడం లేదని ఈ విషయంపై జిల్లా అధికారులు స్పందించి తమను కాపాడాలని. రైతులు కోరుతున్నారు.

Similar News