జాతీయ రహదారి భూసేకరణ, విస్తరణ పనులు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్‌

జాతీయ రహదారి పనులు, భూసేకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని

Update: 2024-05-15 12:56 GMT

దిశ,నాగర్ కర్నూల్ : జాతీయ రహదారి పనులు, భూసేకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో సంబంధిత శాఖలైన రెవెన్యూ, జాతీయ రహదారి అధికారులతో భూసేకరణ పనులు, జాతీయ రహదారి పురోగతి పనులపై సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారికి సంబంధించి జిల్లాలోని కొల్లాపూర్ మండల పరిధిలోని వరిదేల గ్రామ పరిధిలో భూసేకరణ పనులను వేగవంతం చేయాలని, అందుకు సంబంధించిన భూ యజమానులు, రైతులకు రావలసిన నష్టపరిహారాన్ని త్వరతిగతిన చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలో నేషనల్ హైవే అభివృద్ధి పనులు, నేషనల్ హైవే-167k కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు 79 కిలోమీటర్ల వరకు కొనసాగుతున్న విస్తరణ పనుల్లో వేగం పెంచాలన్నారు. లాండ్ ఆక్విజేషన్ పెండింగ్ పనులు అన్నీ త్వరితగతిన పూర్తి కావాలని, అవార్డు పరిహారం చెల్లింపుల పురోగతిపై త్వరలో సమీక్షించనున్న ట్లు తెలిపారు. కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు 79 కిలోమీటర్ల పరిధిలో కొనసాగుతున్న విస్తీర్ణం పనుల్లో ఇప్పటివరకు 33 కిలోమీటర్ల రహదారి పనులు పూర్తయినట్లు జాతీయ రహదారి ఆర్ అండ్ బి ఎస్సీ కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ రహదారి ఆర్ అండ్ బీ ఎస్సీ ధర్మారెడ్డి, కొల్లాపూర్ ఆర్డీవో నాగరాజు, రెవెన్యూ ఆర్ అండ్ బి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Similar News