రాష్ట్రంలోనే మొదటి బసవ భవన్ పాలమూరులో నిర్మించుకున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ స్థలం, నిధులతో పాలమూరులో బసవ భవన్ నిర్మించుకున్నామని...Basava Bhavan at Palamuru

Update: 2022-10-05 05:04 GMT

దిశ, మహబూబ్ నగర్: రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ స్థలం, నిధులతో పాలమూరులో బసవ భవన్ నిర్మించుకున్నామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం ఉదయం స్థానిక వీరణ్ణపేటలో 2వ బసవ భవన్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. మనుషులందరూ ఒక్కటేనని, దేహమే దేవాలయమని భోదించిన మహనీయుడు బసవేశ్వరుడని, స్త్రీ, పురుష భేదం ఉండకూడదనే భోదనలు చేసి సమాజ మార్గదర్శకులయ్యారని అన్నారు. బసవేశ్వరుడి స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ వీరశైవ లింగాయత్ లకు హైదరాబాద్ కోకాపేట్ లో ఏకరా స్థలం, రూ. 10 కోట్ల నిధులు కెటాయించి ఆయన పట్ల తనకున్న భక్తిభావాన్ని చాటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ కేసీ నర్సింహులు, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, నేరేడ్గాం ఆశ్రమ పీఠాధిపతి స్వామి నిరంజన, కౌన్సిలర్ శాంతన్న, జేపీఎన్సీఈ చైర్మెన్ రవికుమార్, కొండా వీరణ్ణ, సిద్ది లింగం, పోకల శివుడు తదితర ఉవీరశైవ లింగాయత్ లు పాల్గొన్నారు.

Similar News