విజయవంతమైన సైన్స్ ఫెయిర్..

జిల్లా కేంద్రంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ ప్రదర్శన కార్యక్రమం విజయవంతమైంది.

Update: 2022-12-06 15:24 GMT

దిశ, నారాయణపేట: జిల్లా కేంద్రంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ ప్రదర్శన కార్యక్రమం విజయవంతమైంది. విద్యార్థులు సుమారు 132 సైన్స్ ప్రదర్శనలు రాగా అందులో కొన్నింటిని ప్రత్యేక ఎంపిక కోసం నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ రీసెర్చ్ అసోసియేట్ డా. మహిమ(గుజరాత్ బృందం) స్వయంగా తిలకించారు. సైన్స్ ఫెయిర్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ పద్మజారాణిలు హాజరై విజేతలకు, గైడ్ టీచర్స్ కు బహుమతులను అందించి అభినందించారు. కాగా సైన్స్ ప్రదర్శనలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థులు తరలిచ్చారు. కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజు, జీసీడీఓ పద్మ నళిని, ఎంఈఓ వెంకటయ్య, సైన్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు కనకప్ప, జిల్లా సైన్స్ అధికారి భాను, స్వామి, యాదయ్య శెట్టి, గంగాధర్, బాల కిష్టప్ప, సాయి నాథ్, పీఈటీ కతలప్ప, రాజేష్, భాస్కర్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Similar News