సమయపాలన పాటించని ఆసుపత్రి సిబ్బంది..

మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో

Update: 2024-05-02 16:07 GMT

దిశ,మాగనూరు : మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించట్లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం సాయంత్రం మండలానికి చెందిన ఓ గర్భిణీ స్త్రీ డెలివరీ కొరకు ఆసుపత్రికి రాగా రెండు గంటలు వేచి ఉన్న సిబ్బంది డాక్టర్లు లేకపోవడం విశేషం. హాస్పిటల్ సిబ్బందితో పాటు అధికారులు కూడా సమయపాలన పాటించట్లేదనె ఆరోపణలు గత కొద్ది రోజులుగా ప్రజల నుంచి వస్తున్నాయి. ప్రతిరోజు విధులకు అక్కడున్నటువంటి సిబ్బంది సరిగా హాజరుకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని అధికారులు సమయపాలన పాటించే విధంగా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

గురువారం రెండు గంటలు వేచి చూసిన గర్భిణీ విషయం తెలుసుకున్న ‘దిశ’ పత్రిక డాక్టర్ ను ప్రశ్నించగా నేను ఇటీవలే ఆసుపత్రికి కొత్తగా వచ్చాను.. ఇంతవరకు ఇటువంటివి తమ దృష్టికి రాలేదని వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు ఆమె దిశ పత్రికకు తెలిపారు.

Similar News