Komati Reddyని కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేయాలి: Konda Surekha సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి, కాంగ్రెస్ కీలక నేత కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-01-21 08:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: పీసీసీ సమావేశంలోమాజీ మంత్రి, కాంగ్రెస్ కీలక నేత కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో అందరం కలిసి పనిచేయకపోవడం వల్లే ఓడిపోయామని.. ఇప్పటికైనా కాంగ్రెస్‌లో అందరు కలిసి పని చేయాలని ఆమె సూచించారు. అంతేకాకుండా పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరించిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, గతకొంత కాలంగా అసంతృప్తితో పార్టీకి దూరంగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా మళ్లీ యాక్టివ్ అయ్యారు. గాంధీభవన్‌లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో వరుసగా భేటీ అవుతున్నారు. ఇకపై పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని ప్రకటించారు. ఈ తరుణంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు టీ- కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. 

ఇదిలా ఉండగా.. కోమటిరెడ్డిపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగత అంశాలు పార్టీ సమావేశంలో మాట్లాడవద్దని.. వ్యక్తిగత అంశాలు ఏమైనా ఉంటే రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్‌ను కలిసి మాట్లాడాలని సూచించారు. కేవలం ఇక్కడ సమావేశం ఎజెండాపైనా మాట్లాడాలని కోరారు.

ఇవి కూడా చదవండి : కోమటిరెడ్డిపై కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు.. రేవంత్‌రెడ్డి రియాక్షన్ ఇదే!

Tags:    

Similar News