Telangana Floods : డేంజర్‌లో కడెం ప్రాజెక్ట్.. డ్యాం పై నుంచి వరద ఓవర్ ఫ్లో (వీడియో)

నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ కు వరద పోటెత్తెంది.

Update: 2023-07-27 02:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తెంది. కడెం ప్రాజెక్ట్‌పై నుంచి వరద పొంగుతోంది. దీంతో కడెం వాసులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. అంతకంతకు ప్రాజెక్ట్‌కు వరద పెరుగుతుండటంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే అధికారులు 12 గ్రామాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 14 గేట్లు ఎత్తి 2,24, 901 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్ట్ సామర్థ్యం 3.50 లక్షల క్యూసెక్కులు కాగా, 6.04 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. సామర్థ్యానికి మించి వరద వస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే హై టెన్షన్ వాతావరణం నెలకొంది. 

Also Read: అడవిలో 10 గంటలు చిక్కుకున్న 80 మంది పర్యాటకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News