రక్త హీనతతోనే అనారోగ్యం: అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్

పోషక ఆహారం లోపంతో పిల్లలు, గర్భిణులు రక్త హీనతతో అనారోగ్యానికి గురవుతున్నారని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు.

Update: 2023-03-28 13:47 GMT

దిశ, హుజూరాబాద్: పోషక ఆహారం లోపంతో పిల్లలు, గర్భిణులు రక్త హీనతతో అనారోగ్యానికి గురవుతున్నారని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. మంగళవారం పట్టణంలోని కన్యకా పరమేశ్వరీ ఆలయ మండపంలో పోషక అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషక లోపం ఉన్న వారిని గుర్తించి పౌష్టికాహారం అందించాలని సూచించారు. పిల్లల ఎదుగుదల, గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో గర్భిణులకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు.

అనంతరం మండల పరిధిలోని తుమ్మనపల్లి గ్రామంలో నిర్వహించిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ఆమె పరిశీలించారు. శిబిరంలో అందుతున్న సేవలను గురించి గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో దోభీఘాట్ నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, ఆర్దీవో హరిసింగ్, డిప్యూటీ డీఎంహెచ్ వో చందు, తహసీల్దార్ కోమల్ రెడ్డి, సీడీపీవో భాగ్యలక్ష్మి, మునిసిపల్ కమిషనర్ సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News