పోతుగల్ ఎఎంసీ సీటు వరించేది ఎవరినో ?

ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం చాలా మంది పోటీ పడుతున్నారు.

Update: 2023-02-06 17:14 GMT

దిశ, ముస్తాబాద్: మండలం‌లోని పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ చైర్మన్ పదవి కాలం గత సంవత్సరం డిసెంబర్‌లో ముగిసిన విషయం విదితమే. కాగా ఈ పదవి రేసుకి ఇపుడు ఆశావాహులు పదుల సంఖ్యలో వరుస కట్టారు. నామినేటెడ్ పోస్ట్ అయిన ఎఎంసి పదవికి మండలం నుండి బీఆర్‌ఎస్ పార్టీ నుండి దాదాపు 10 మంది కన్నెశారు. ఈ పది మంది జాబితా మంత్రి కేటీఆర్ పరిశీలిస్తున్నాడని, ఈ లిస్టులో మాజీ ఎఎంసి చైర్మన్ పేరు కూడా మండలం నుండి పంపినట్లు సమాచారం. ఇపుడు ఈ మాజీ చైర్మన్‌నే మరోమారు ఎఎంసి సీటు వరించనున్నట్లు మండలంలో చర్చ జరుగుతోంది. కేటీఆర్ కూడా సదరు నాయకుని పట్ల ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

Similar News