కొండగట్టులో వేయి ఎకరాలకుపైగా అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న ఎంపీ సంతోష్

సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో... Green India Challenge in Kondagattu on CM's birthday

Update: 2023-02-16 16:05 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి: సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో 1094 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుని గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టనున్నట్లు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కొండగట్టు క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వచ్చే కంపార్టెమెంట్ 684లో 752 ఎకరాలు, 685లో 342 ఎకరాలు మొత్తం 1,094 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకోనున్నట్లు తెలిపారు. మొదటి విడతగా కోటి రూపాయల వ్యయంతో ఈ వెయ్యి ఎకరాల అటవీ భూమికి మరింత పచ్చందాలు అద్దుతామని ఎంపీ ప్రకటించారు. దశల వారీగా మిగతా నిధులు కూడా అందించి పనులు పూర్తి చేస్తామని ఎంపీ తెలిపారు. ఆలయ పరిసరాల్లో సుగంధ, ఔషధ, ఎర్రచందనం మొక్కలతోపాటు పెద్ద ఎత్తున సంచరించే కోతులను అటవీ ప్రాంతానికి పరిమితం చేసేలా పెద్ద ఎత్తున పండ్ల మొక్కలు నాటి మంకీ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News