బతుకమ్మ చీరలు తీసుకోకుండా ఇంటి బాట పట్టిన మహిళలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సర్కార్ కానుకగా బతుకమ్మ చీరలను అందజేసేందుకు శ్రీకారం చు

Update: 2022-09-23 14:22 GMT

దిశ, పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సర్కార్ కానుకగా బతుకమ్మ చీరలను అందజేసేందుకు శ్రీకారం చుట్టింది అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఉండగా.. బతుకమ్మ చీరల పంపిణీ కోసం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉదయం 10 గంటలకు వస్తున్నారని గ్రామస్తులకు ముందస్తు సమాచారం ఇచ్చారు.

మహిళలు పెద్ద సంఖ్యలో గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన సభకు వచ్చి కూర్చున్నారు. మంత్రి ఎంతకీ రాకపోవడంతో కొంతమంది మహిళలు ఓపిక నశించి అసహనానికి గురై ఇంటి ముఖం పట్టారు. మహిళలతో పాటు జిల్లా కలెక్టర్ సైతం వేచి చూడక తప్పలేదు. గంటన్నర తర్వాత వచ్చిన మంత్రి.. మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.

అయితే బతుకమ్మ చీరలు ఏమి బాగోలేవని, నాలుగు సార్లు కట్టుకుంటే పనికిరాకుండా పోతాయని చీరలకు బదులు రూ.500 ఇస్తే మేము షాపులో కొత్త చీరలు తీసుకుంటామని వారు మనసులో మాటను వెళ్లగక్కారు.

Similar News