ఆత్మీయ గురువుకు మరపురాని సన్మానం

తమకు విద్యాబుద్ధులను చెప్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఆ గురువును విద్యార్థులు మర్చిపోలేదు.

Update: 2024-05-04 14:41 GMT

దిశ, కొడిమ్యాల : తమకు విద్యాబుద్ధులను చెప్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఆ గురువును విద్యార్థులు మర్చిపోలేదు. 50 సంవత్సరాల తర్వాత తమ ఆత్మీయ గురువును వెతుక్కుంటూ వచ్చి మరీ ఆశీర్వాదం తీసుకున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామానికి చెందిన పైడిపల్లి శ్రీ రంగారావు 1974లో మానకొండూరు మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు.

    ఆ సంవత్సరంలో పదవ తరగతి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుడు శ్రీ రంగారావు ను అప్పటి విద్యార్థులు అడ్రస్ కనుక్కొని వెతుక్కుంటూ వచ్చి శనివారం కలుసుకున్నారు. అనంతరం శాలువాతో సత్కరించారు. తమ గురువుతో ఉన్న అనుబంధాన్ని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అప్పటి విద్యార్థులు గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్న తరుణంలో వృద్ధాప్యం తో ఉన్న తమ గురువు కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో వారే గురువు ఇంటికి వచ్చి కలుసుకున్నారు.

Similar News