రాష్ట్ర అధికార గీతంగా ‘జయ జయహే తెలంగాణ’ ఇంతకు ముందు లేదా?

డాక్టర్ అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపికయింది.

Update: 2024-02-04 16:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ‘జయ జయహే తెలంగాణ’ పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపికయింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్‌లో జరిగిన కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన కీలక విషయాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర అధికార గీతంగా ‘జయ జయహే తెలంగాణ’ అనే పాటను కేబినెట్ ఆమోదం. అయితే తెలంగాణలోని కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులు ఈ పాటను పాడుతున్నారు.

అయితే ఈ గీతాన్ని గత ప్రభుత్వం అధికారికంగా గుర్తించలేదని, 2021లో మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రం గీతం రాసుకున్నప్పుడు దాని గురించి ప్రకటన చేస్తామని కేసీఆర్ అప్పట్లో చెప్పారు. ఈ క్రమంలోనే ఈ పాటకు రాష్ట్ర గీతం హోదాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్పించింది.

Tags:    

Similar News