ACB Raids: ఏసీబీ వలలో డిప్యూటీ తహసీల్దార్.. లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఓ డిప్యూటీ తహసీల్దార్‌ను అదుపులోకి తీసుకున్న ఘటన భద్రాద్రి జిల్లా చర్లలో చోటుచేసుకుంది.

Update: 2024-05-23 10:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఓ డిప్యూటీ తహసీల్దార్‌ను అదుపులోకి తీసుకున్న ఘటన భద్రాద్రి జిల్లా చర్లలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చర్ల మండల రెవెన్యూ కార్యలయంలో బీరవెల్లి భరణి బాబు అనే వ్యక్తి డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే కొత్తపల్లి అనుబంధ గ్రామమైన దండుపేటకు చెందిన కర్ల రాంబాబు, తన భూమి పట్టా చేయించాడు, అందుకు సంబంధించి పాసు పుస్తకం కోసం డిప్యూటీ తహసీల్దార్‌ భరణి బాబును ఆశ్రయించాడు. అయితే, పాసు పుస్తకం కావలంటే తనకు రూ.50 వేలు లంచంగా ఇవ్వాలంటూ భరణి డిమాండ్ చేశాడు. దీంతో ఆ వేధింపులు తట్టుకోలేక సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇవాళ రైతు రాంబాబు, భరణి బాబుకు రూ.20 వేలు నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌ అదుపులోకి తీసుకున్నారు.గా పట్టుకున్నారు.గతంలో బూర్గంపాడు లో డిటి గా పనిచేస్తున్న సమయంలో ట్రాక్టర్ యజమానుల నుండి లంచం ఆశించి పట్టుబడ్డారు.ఇది రెండవ సారి పట్టుబడటం.

Tags:    

Similar News