'జమ్మికుంట రైల్వే స్టేషన్ సమస్యలు పరిష్కరించాలి'

జమ్మికుంట రైల్వే‌స్టేషన్‌ను సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ శుక్రవారం సందర్శించారు.

Update: 2022-11-25 07:22 GMT

దిశ, జమ్మికుంట : జమ్మికుంట రైల్వే‌స్టేషన్‌ను సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి రైల్వే సమస్యలు పరిష్కరించాలని జీఎంకు వినతి పత్రం అందజేశారు. కొత్తపెల్లి గ్రామస్థులు ప్రతిరోజు జమ్మికుంట రైల్వే‌స్టేషన్ నుండి ట్రాక్ దాటి జమ్మికుంట పట్టణానికి జీవనోపాధి కోసం వెళ్తుంటారని. విద్యార్థులు స్కూల్, కళాశాలకు వెళ్తుంటారని తెలిపారు. ఈ క్రమంలో ట్రాక్ దాటి వెళ్తున్న సమయంలో రైలు ఢీకొన్న సందర్భాలున్నాయని జీఎం దృష్టికి తీసుకెళ్లారు.

ప్రాణాలు పోయిన సందర్భాలున్నాయని తెలిపారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. లిఫ్ట్ సౌకర్యం కల్పించాలన్నారు. రైల్వే స్టేషన్ నుంచి జమ్మికుంట వెళ్లే సమయంలో రైల్వే స్టేషన్ టికెట్టు లేదని జరిమానాలు విధిస్తున్నారని తెలిపారు. జరిమానాలు వేయకుండా చొరవ చూపాలన్నారు. స్టేషన్‌లో రాయపూర్ ఎక్స్‌ప్రెస్, దక్షిణ ఎక్స్‌ప్రెస్, ధనపూర్ ఎక్స్‌ప్రెస్, నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జమ్మికుంటలో స్టాప్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

Tags:    

Similar News