సింపతీ పొందేందుకే కాంగ్రెస్ నిరసనలు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకుగాను ఆయన తన... Ponguleti Sudhaker Reddy hits out at Rahul

Update: 2023-03-26 08:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకుగాను ఆయన తన ఎంపీ పదవికి డిస్ క్వాలిఫై అయ్యారని, కానీ ఈ అంశంపై నిరసనలు, దీక్షల పేరుతో కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శలు చేశారు. కానీ ఈ అంశాన్ని కూడా కాంగ్రెస్ రాజకీయం చేయాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. కోర్టు ఇచ్చిన తీర్పును కూడా వారు కనీసం పట్టించుకోవడం లేదని ఫైరయ్యారు. డిస్ క్వాలిఫై విషయంలో పైస్థాయి కోర్టుకు వెళ్లి అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నా రాహుల్ వెళ్లను అని చెప్పి ఇప్పుడు ఈ అంశాన్ని రాజకీయం చేసి సింపతీ పొందాలని చూస్తున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ కనుమరుగవుతోందని, గ్రౌండ్ స్థాయిలో వీక్ అవుతోందని, అందుకే ఈ స్టంట్ కు దిగారన్నారు. అదానీ పేరుతో ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇతర పార్టీలను కూడా వెంటపెట్టుకుని బీజేపీ ప్రతిష్టను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారన్నారు. వాళ్లు ఎన్ని ధర్నాలు, నిరసనలు చేసినా ప్రజలు వారిని పట్టించుకోరని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోయాడని, ఆయనకు అంత ఓపిక కూడా లేకుండాపోయిందని మండిపడ్డారు. ఇది రాహుల్ గాంధీ మైండ్ సెట్ కు నిదర్శనంగా ఆయన చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News