ఈ నెల 11న మెగా జాబ్ మేళా
రాష్ట్ర యువజన సర్వీసులశాఖ ఆధ్వర్యంలో 11న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నామని, నగరంలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వేణుగోపాల్ రావు కోరారు.
దిశ, చార్మినార్ : రాష్ట్ర యువజన సర్వీసులశాఖ ఆధ్వర్యంలో 11న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నామని, నగరంలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వేణుగోపాల్ రావు కోరారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు యువజన సర్వీసుల శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగానే సరూర్నగర్ స్టేడియంలో 11న ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ జాబ్ మేళా ఉంటుందన్నారు. దాదాపు 108 కంపెనీలలో 10వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, అండర్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, బీఏ, బీకామ్, ఎంఏ, ఎంకామ్, బీ ఫార్మసి, ఎం.ఫార్మసి, బీ ఈ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్స్ అర్హతలు కలిగిన వారు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9182476721, 9014846853, 6202374845లకు సంప్రదించాలని సూచించారు.