ఎన్నికల ఫిర్యాదులు ఇలా చేయండి : కలెక్టర్

పార్లమెంట్ ఎన్నికల అంశాలకు సంబంధించి ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఆయా పార్టీల, అభ్యర్థులు ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదులు, సూచనలు చేయవచ్చని హైదరాబాద్ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు.

Update: 2024-04-26 12:50 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో : పార్లమెంట్ ఎన్నికల అంశాలకు సంబంధించి ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఆయా పార్టీల, అభ్యర్థులు ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదులు, సూచనలు చేయవచ్చని హైదరాబాద్ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. నియోజకవర్గం సాధారణ పరిశీలకులుగా పిఐ శ్రీవిద్య ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిందని తెలిపారు.

సెగ్మెంట్ పరిధిలోని ఎన్నికల సంబంధిత అంశాలపై ఫిర్యాదులు చేయదలచిన వారు జనరల్ అబ్జర్వర్ ను సెల్ నెంబర్ 91543 42023 ద్వారా సంప్రదించవచ్చని, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన వినతులను తీసుకొనుటకు జిహెచ్ఎంసి ప్రతిరోజూ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12,సిటీ మేనేజర్స్ ట్రైనింగ్ సెంటర్, 3వ ఫ్లోర్ లో ఉదయం 8.30 నుండి 9.30 గంటల మధ్యన నేరుగా కలిసి ఫిర్యాదులు, సూచనలు అందజేయవచ్చని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు , పోటీలో ఉన్న అభ్యర్థులు, ఇతరులు తమ సమస్యలను రాతపూర్వకంగా ఇవ్వవచ్చని రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు.

Similar News