వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి.. ఆస్పత్రి ఎదుట బాధితుల ఆందోళన

దిశ, అంబర్ పేట్: వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి - Baby died due to negligence of doctors.. Victims are worried in front of the hospital

Update: 2022-08-18 16:14 GMT

దిశ, అంబర్ పేట్: వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందిన సంఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంనగర్ ప్రాంతానికి చెందిన స్రవంతి (28), వంశీ వర్ధన్ దంపతులు. స్రవంతి 9 నెల గర్భిణీ కావడంతో ఈ నెల 15వ తేదీన పురిటి నొప్పులు రావడంతో విద్యానగర్‌లోని దుర్గాబాయి దేశముఖ్ ఆసుపత్రికి తరలించారు. స్రవంతిని పరీక్షించిన వైద్యులు అబ్జర్వేషన్‌లో రెండు రోజులు ఉంచాలని సూచించారు. అదే క్రమంలో స్రవంతి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది.

స్రవంతి కుటుంబ సభ్యులు వైద్యులను నిలదీయడంతో హుటాహుటిన ఆపరేషన్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మరణించింది. విషయం తెలుసుకున్న స్రవంతి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆసుపత్రికి చేరుకుని ఆందోళన చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే పసికందు మరణించిందని స్రవంతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తాము ఆసుపత్రికి వచ్చిన వెంటనే ఆపరేషన్ చేస్తే పాప బ్రతికేదని కుటుంబ సభ్యులు అన్నారు. సమాచారం తెలుసుకున్న నల్లకుంట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను సముదాయించారు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News